నవతెలంగాణ-హైదరాబాద్: ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అందుకు కేంద్ర ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడమే తరువాయి. ఈక్రమంలో ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార పార్టీతో పాటు ఇండియా బ్లాక్ కూటమి నేతలు పలుమార్లు బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పీఎం ప్రధాని ఇప్పటికే పలుమార్లు బీహార్ లోని పలు జిల్లాల్లో పర్యటించారు. అదే విధంగా ప్రస్తుత సీఎం నితిష్ కుమార్ ముందస్తుగా ఎన్నికల వరాలు కురిపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వైయనాడ్ ఎంపీ ప్రియాంక్ గాంధీ బీహార్ పర్యటించనున్నారు. సెప్టెంబర్ 26న మోతిహరికు వెళ్లనున్నారు. ఆ తర్వాత గాంధీ మైదాన్‌లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో మాట్లానున్నారు. ప్రియాంక పర్యటనలో నేఫథ్యంలో ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా సభకు పార్టీశ్రేణులు తరలివచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నేతలతో పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈనెల 26న బీహార్ వెళ్లనున్న ప్రియాంక గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES