Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యల స్వాగతం.!

సమస్యల స్వాగతం.!

- Advertisement -

కొత్త సర్పంచ్ లపై నమ్మకం పెట్టుకున్న ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు

దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు ఆన్నాడు మహాత్మాగాంధీ. ఆ అభివృద్ధి సర్పంచ్ల అందులో ముఖ్యంగా యువత చేతుల్లోనే ఉందని ప్రజలు నమ్ముతూ.. ఓటు వేసి గెలిపిస్తున్నారు. మూడవ విడతలో స్థానిక సంస్థల ఎన్నిక ల్లో మండలంలో ఉన్న 15 గ్రామ పంచాయతీల్లో యువత,మహిళలను ప్రజలు ఎన్నుకున్నారు. కానీ వారికి గ్రామంలో నెలకొన్న సమస్యలు సవాలుగా మారనున్నాయి. గెలుపొందిన కొత్త సర్పంచ్లకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. గత రెండు సంవత్సరాల క్రితం సర్పంచ్ పాలన ముగిసినా.. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక ప్రత్యేకాధికారుల పాలన సాగిస్తూ.. వచ్చింది.

దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటువడింది. నిధుల లేమితో పంచాయతీ కార్యదర్శులకు కూడా భారంగా మారింది. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ.. నెట్టుకొచ్చారు.కొన్ని చోట్ల పంచాయతీ ట్రాక్టర్ నడిపేందుకు కూడా డిజిల్ లేని పరిస్థితి నెలకొంది. వీధిలైట్లు లేక గ్రామాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఇలా పనులు పెండింగ్లో ఉన్నాయి. నూతనంగా పదవి చేప ట్టనున్న ప్రథమ పౌరులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -