Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Dussehra : దుర్గామాత పూజలో పాల్గొన్న ప్రముఖ పరిశ్రామికవేత్త

Dussehra : దుర్గామాత పూజలో పాల్గొన్న ప్రముఖ పరిశ్రామికవేత్త

- Advertisement -

ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, సంఘ సేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి

నవతెలంగాణ కామారెడ్డి, బిబిపేట్

కామారెడ్డి జిల్లా జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, సంఘ సేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఆయన సొంత గ్రామం జనగామలో దసరా రోజున దుర్గామాత మండపంలో సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని దుర్గా దేవిని ప్రార్థించడం జరిగిందన్నారు.

ప్రతి ఒక్కరి పిల్లలను పనులు (బాల కార్మికులుగా) చేయించకుండా పాఠశాలలకు పంపించి విద్యాబుద్ధులు నేర్పించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, వెంకట్ గౌడ్, శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, నాగరాజు రెడ్డి, వెంకట్ రెడ్డి, సిద్ది రెడ్డి, బాపురెడ్డి, భూమా గౌడ్, శ్రవణ్ కుమార్, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -