Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అతి త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు చేస్తామని వాగ్దానం 

అతి త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు చేస్తామని వాగ్దానం 

- Advertisement -

బిల్లుల జాప్యానికి రైతులకు క్షమాపణలు 
మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్

అతి త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు పేమెంట్ చేస్తామని వాగ్దానం చేసామని మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం, యాదగిరిగుట్ట, ఆయన మాట్లాడుతూ డైరెక్టర్లు అందరం కలిసి ఎన్ డి డి బి ని అందరి సమక్షంలో  పిలిచి, ఎన్ డి డి బి అయితేనే మదర్ డైరీ కి పూర్వవైభవం వస్తుందని, రైతులకు ఇవ్వాల్సిన డబ్బు కూడా సకాలంలో చెల్లించడానికి వీలుంటుంది అని అన్నారు. కొన్ని బ్యాంకుల ఇబ్బందులు జరగడం వల్ల బిల్లులు ఇన్ని రోజులు ఆలస్యమైంది అని, బ్యాంకు వాళ్ళ క్లియరెన్స్ కూడా వాళ్లే తీసుకొని అతి త్వరలోనే రైతులకు చేయాల్సిన పేమెంట్లు చేస్తామని అన్నారు. ఆలేరు శాసనసభ్యులు ముందు కూడా ఎన్ డి డి బి వాళ్లు అతి త్వరలో రైతులకు పేమెంట్ క్లియర్ చేస్తామని అన్నారు అని తెలిపారు.

డైరెక్టర్ లము అంతా సమిష్టి నిర్ణయం తోటి ఎన్ డి డి బి వాళ్ల కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే రైతులకు డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. మళ్లీ ఎటువంటి ఇబ్బంది ముందు ముందు రాకుండా మదర్ డైరీని కాపాడడానికి మా వంతు కృషి మేము చేస్తామన్నారు. జరిగిన ఆలస్యానికి రైతులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా ప్రొక్యూర్మెంట్ ను యధావిధిగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. 15 రోజులకు ఒకసారి పేమెంట్లు వస్తాయని అన్నారు. జరిగిన జాప్యానికి క్షమించాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కల్లేపల్లి శ్రీశైలం, పుప్పాల నరసింహ, కందాల రంగారెడ్డి, సందిల భాస్కర్ గౌడ్, గొల్లపల్లి రాం రెడ్డి, నరేందర్ రెడ్డి, కస్తూరి పాండు, మండలి జంగయ్య, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -