Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంఇంజినీర్లకు పదోన్నతులు

ఇంజినీర్లకు పదోన్నతులు

- Advertisement -

– ఇంథనశాఖ ముఖ్య కార్యదర్శికి టీజీపీఈఏ కృతజ్ఞతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

విద్యుత్‌శాఖలో ఒకేసారి 209 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లకు అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా పదోన్నతులు లభించాయి. వీరంతా 2012 బ్యాచ్‌కు చెందినవారు. 2015 తర్వాత విద్యుత్‌శాఖలో ఇంతపెద్ద ఎత్తున పదోన్నతులు ఇవ్వడం ఇదే తొలిసారి అని తెలంగాణ పవర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ (టీజీపీఈఏ) సెక్రటరీ జనరల్‌ పీ సదానందం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారంనాడాయన సహచర ఇంజినీర్లతో కలిసి ఇంథనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను కృతజ్ఞతలు తెలిపారు. 4వేల మెగావాట్ల వ్యవస్థాపిత సామర్ధ్యంతో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌)ను జాతికి అంకితం చేయడానికి అనుగుణంగా ఇంజనీర్లకు ఈ పదోన్నతులు ఇచ్చారని వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకు థన్యవాదాలు తెలిపారు. ముఖ్యకార్యదర్శిని కలిసిన వారిలో టీజీపీఈఏ నాయకులు సురేష్‌ కుమార్‌, విద్యాసాగర్‌, బుచ్చయ్య, పీవీ రావు, ప్రశాంత్‌, వెంకటేశ్‌, మల్లయ్య, రాజేశ్వర్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -