నవతెలంగాణ-కమ్మర్ పల్లి
నర్సరీ పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న నర్సరీని ఆయన భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఆవరణలో గ్రామపంచాయతీ నరసరిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామంలో వర్షాకాలంలో లక్ష్యం మేరకు నాటేందుకు అవసరమైన మొక్కల్ని నర్సరీలో సిద్ధం చేయాలని నిర్వాహకులకు సూచించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన జాగ్రత్తలు పాటించి నర్సరీని నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
నర్సరీ పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



