Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
బాలల హక్కులను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్ అన్నారు. కాటారంలోని తిమోతి బాయ్స్ హోంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మయాంక్ సింగ్ మాట్లాడుతూ… బాలలకు ప్రధానంగా జీవించే, అభివృద్ధి చెందే, రక్షణ పొందే, భాగస్వామ్యపు హక్కులు ఉంటాయని తెలిపారు. ఆపదలో ఉన్న బాలబాలికలు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసినట్లయితే వారిని రక్షించడం జరుగుతుందన్నారు. బాలల హక్కులను కాపాడడానికి ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఉందని, పిల్లల భద్రత కొరకు జిల్లా అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా అవుట్డోర్, ఇండోర్ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం జరిగిందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ…సమాజంలో ప్రతి వ్యక్తి బాలల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఎవరైనా ఆపదలో ఉన్న బాల బాలికలను గుర్తించినట్లయితే 1098కు ఫోన్ చేసినట్లయితే ఆ బాలలను రక్షిస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా బాల కార్మికులు, అక్రమ శిశువుల దత్తత తదితర బాలల సమస్యలను అరికట్టడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమం తదనంతరము పిల్లలచే పాటలు పాడించడం డ్యాన్సులు వేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సీడీపీఓ రాధిక, సూపర్వైజర్, డీసీపీయు సోషల్ వర్కర్ సోషల్ కుమార్, హోం డైరెక్టర్ డేవిడ్ మార్క్, హోం ఇంచార్జ్ హృదయానంద్, అశోక్, బాలబాలికలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -