Friday, October 10, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అడవులు వన్నె ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత కావాలి

అడవులు వన్నె ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత కావాలి

- Advertisement -

జన్నారం డివిజన్లో వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ పర్యటన
నవతెలంగాణ – జన్నారం

జన్నారం అటవీ డివిజన్లో వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఏలుసింగ్ మేరు పర్యటించారు. జన్నారం వచ్చిన ఆయనకు ఎఫ్ పీటీ శాంతరాం, డీఎఫ్ వో శివ్ ఆశిష్ సింగ్, ఎఫ్డీవో రామ్మోహన్ మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇందన్పల్లి రేంజ్లోని కావ్వాల్ సెక్షన్   పాలఘోరి ప్రాంతంలో పర్యటించారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన   ఆదివాసీ గిరిజనులు   గుడిసెలు వేసిన ప్రాంతంలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నాటిన మొక్కలను పరిశీలించారు.

 అనంతరం జన్నారంలో గేట్ నం బర్ 1 నుంచి సఫారి ద్వారా బైసన్ కుంట, గొండు గూడ బేస్ క్యాంపులో పర్యాటకులు వెళ్లే ప్రాంతాన్ని పరిశీలించారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, చేపట్టిన అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచ నలు చేశారు. రేంజ్ అధికారులు సుష్మారావు, శ్రీధ రచారి, మమత, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -