- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ గ్రామ శివారులో ఫ్యూజన్ కంపెనీ నిర్మాణ పనులు సోమవారం మళ్లీ ప్రారంభించడంతో పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ సాయ గౌడ్, గ్రామస్తుల ఆధ్వర్యంలో కంపెనీ నిర్మాణ పనుల వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఫ్యూజన్ కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతూ ఎమ్మార్వో సునీతకు వినతి పత్రం సమర్పించారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే కంపెనీ నిర్మాణాలు చేపట్టవద్దని, సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని సర్పంచ్, గ్రామస్థులు తెలిపారు.
- Advertisement -



