నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో కోతుల బెడద తీర్చాలని శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట టీచర్స్ కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. కోతుల సమస్యతో బాధపడుతున్నామని వాటి నుండి రక్షించాలని డిమాండ్ చేశారు. కోతుల పట్టేందుకు మున్సిపల్ ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. వందల కొద్దీ కోతులు రాత్రి పగలు రోడ్ల వెంట తిరుగుతు ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తలుపులు తీసి ఉన్న ఇంటిలోకీ జోరపడి తినే వస్తువులు తీసుక వెళుతున్నాయని, ఏదిరి తిరిగు తే గుంపుల కొద్దీ కోతులు మీదికీ కరువడానికీ వస్తున్నాయన్నారు. వెంటనే కోతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యలయం సానీటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ వాసులు అయిలేని మల్లికార్జున రెడ్డి అయిత కైలసం పూదరి మల్లేశం సావుల రవీందర్, సదానoదం, దుర్గయ్య, కనుకయ్య, గోవింద్, సాయి తదితరులు పాల్గొన్నారు.
కోతుల బెడద తీర్చాలని మున్సిపల్ ఎదుట నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



