నవతెలంగాణ-హైదరాబాద్: ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. అమెరికా మేక్ ఎగైన్ ఫస్ట్ అనే స్లోగన్‌తో యూఎస్ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టి నేటీతో ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. దీంతో యూఎస్ వ్యాప్తంగా ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఏడాది కాలంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలతో యూఎస్ పరువును దిగజారిపోయిందని, ప్రపంచంలో వాషింగ్టన్ స్థాయి పడిపోతుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ రెండో దఫా పాలనపై నిరసనకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లకార్డులను చేతబూని ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కానుంచి వివాదాస్పద నిర్ణయాలతో హల్‌చల్ చేశారు. మొదటగా ప్రపంచదేశాలపై టారిఫ్‌ల మోత మోగించారు. తమ దేశ ఉత్పత్తులపై అధిక పన్నులు విధిస్తున్నారని, ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో ఆయన నిర్ణయాన్ని ఆయా దేశాలు ఖండించాయి. చైనా, కెనడా, యూరోపియన్ దేశాలతో పాటు పలు దేశాలు యూఎస్ పై కూడా టారిఫ్‌లు విధించారు. ఈ చర్యతో ఖంగుతిన్న ట్రంప్.. కాస్తా వెనుక్కు తగ్గారు.
యూఎస్‌లో అక్రమ వలసల నివారణ పేరుతో ఆయా దేశాల విద్యార్థుల పట్ల ట్రంప్ అమానుషంగా వ్యవహరించారు. సరైన విచారణ లేకుండానే అరెస్ట్ చేసి చేతులకు సంకెళ్లు వేసి స్వదేశాలకు పంపించారు. ఆ తర్వాత చైనా, ఇండియా పౌరులే లక్ష్యంగా వీసా నిబంధనలు కఠిన తరం చేశారు. హెచ్‌వన్ బీ వీసా ఫీజులను లక్ష డాలర్ల వరకు అమాంతం పెంచారు. ఈ చర్యతో ఇంటాబయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పలు నిబంధనల సరళీకరణ పేరుతో ట్రంప్ సర్కార్ దిద్దుబాటు చర్యలు తీసుకుంది.
అదే విధంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని, మాస్కో-కీవ్‌ల మధ్య తక్షణమే శాంతి ఒప్పందం కుదరాలని డిమాండ్ చేశారు. కానీ మరోవైపు గాజా, ఇరాన్‌లపై యుద్ధానికి ఇజ్రాయిల్‌ను ప్రోత్సాహించారు. దీంతో ఆయన ద్వంద్వ వైఖరీ పట్ల అనేక దేశాలు విస్మయం వ్యక్తం చేశారు. అణు ఆయుధాల సాగుతో ఇరాన్‌పై నేరుగా వైమానిక దాడులకు పాల్పడ్డారు. అనేక దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని అంతర్జాతీయ నిబంధనలను తుంగలోతొక్కారు.
తమకు గిట్టని దేశాలపై, తనకు అనుకూలంగా లేని ఆయా దేశాల అధినేతలపై టారిఫ్‌ల బూచి పేరుతో ట్రంప్ భయపెట్టారు. వెనిజులా సహజవనరులపై కన్నెసిన డొనాల్డ్ ట్రంప్ ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను నిర్భంధించి యూఎస్‌కు తరలించారు. ఆ తర్వాత 8 యుద్ధాలను ఆపానంటూ పగల్భాలు పలికి..తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలని చిన్నపిల్లాడిలా ప్రవర్తించారు. తాజాగా డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్ లాండ్‌ను ఆక్రమించుకోవడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. దీంతో ట్రంప్ అసలు నిజస్వరూపం బయటపడింది. మెక్సికో, కెనడా దేశాలు కూడా అమెరికాలో భాగమేనని తనలో ఉన్న సామ్రాజ్యవాద కాంక్షను ప్రపంచదేశాలకు తనకు తానుగా ట్రంప్ తెలియజేశారు.

తనకు శాంతి బహుమతి రాలేదని, అందుకే ప్రపంచంలో అశాంతికి తెరలేపానని ట్రంప్ పిచ్చెక్కి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నేనింతే అంటూ బీరాలు పలుకుతున్న ట్రంప్‌కు ఆదేశ ప్రజలే తగిన బుద్ది చెప్పానున్నారు. ఈక్రమంలోనే ఏడాది కాలంలో ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ యూఎస్ ప్రజలు ఆందోళనలు చెప్పారు. పెద్ద యోత్తున ఆ దేశ ప్రధాన నగరాల్లో నిరసనలు చేపట్టారు.




