నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ మాజి వైస్ చైర్మన్ శ్రీ కర్నాటి లింగారెడ్డి, ఎంపీడీఓ ఉమా దేవి, జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి,మండల విద్యాధికారి రాము గారి చేతుల మీదుగా శుక్రవారం పీఆర్టీయు పెద్దవూర మండల శాఖ నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను పిఆర్సిను వెంటనే అమలు చేయాలని హెల్త్ కార్డులను అమలుపరచాలనికోరారు. సర్వీస్ రూల్స్ రూపొందించాలని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనం చెల్లించాలని,మినిమం టైమ్స్ స్కేల్ ఇవ్వాలనితెలిపారు.అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు సిఆర్టి లతో సమానంగా వేతనాలు అందించాలని అన్నారు.ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,ఇతర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లి oచాలని కోరారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్ష కార్యదర్శులు ఇరుమాదిపాపిరెడ్డి, ఎన్ దుర్గాప్రసాద్,పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, వెంకట్రావు నాయక్, ఉపాధ్యాయులు చిన్న నారాయణ రెడ్డి, మాజీ అధ్యక్షులు వీరారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి రూపారెడ్డి, జిల్లా నాయకులు దేవేందర్, లక్ష్మీప్రభ, జానారెడ్డి, తుడి వెంకటరెడ్డి, కాసం శ్రీనివాస్, శైలేష్,నరేందర్, గోపాల్, కళా రామ్మూర్తి, పాల్గొన్నారు.
పీఆర్టీయు పెద్దవూర మండల శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



