Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వారం రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి..

వారం రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి..

- Advertisement -

– అధికారులు అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు..
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ : పెండింగ్ లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని లేదంటే తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు.సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఫిర్యాదుల పరిష్కారం అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వివిధ అంశాలను సమీక్షిస్తూ కొన్ని శాఖల్లో ఎక్కువ రోజుల నుండి ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, అలాంటి శాఖల అధికారులు వారం రోజుల్లో పెండింగ్ ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించాలని, లేనట్లయితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణి ఫిర్యాదులతోపాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులు, ఇతర ఫిర్యాదులపై దృష్టి సారించి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా అధికారులు సమస్యల పరిష్కారం తో పాటు, ప్రభుత్వ పథకాల సక్రమ అమలుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని, తనకు ప్రతిరోజు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజావాణిలో భూములకు సంబంధించి 38 ఫిర్యాదులు, ఎంపీడీవోలకు 11, జిల్లా, ఇతర అధికారులకు 47 ఫిర్యాదులు ,మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి .వీటన్నింటిని సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరిగిందని, జాగ్రత్తగా అన్నిటిని పరిశీలించి జాప్యం లేకుండా వేగంగా పరిష్కరించినందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు.అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డిఆర్డిఓ వి వి.అప్పారావు, డిఎఫ్ఓ సతీష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి ,జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad