Friday, May 2, 2025
Homeతాజా వార్తలుమేడే స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు

మేడే స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు

– కులగణనకు కేంద్రం కాలపరిమితి విధించాలి
– కార్పొరేట్లకు వనరులను కట్టబెట్టేందుకే ఆపరేషన్‌ కగార్‌ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌
– ఎంబీ భవన్‌ వద్ద మేడే వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మేడే స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనగణనతోపాటు కులగణనను చేపడతామంటూ ప్రకటించిందనీ, దానికి నిర్దిష్ట కాలపరిమితిని విధించాలని డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యా లయం ఎంబీ భవన్‌లో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ అరుణపతాకాన్ని ఆవిష్క రించారు. ఆనాడు ఎనిమిది గంటల పనివిధానం కోసం కార్మికులు పోరాడితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 12 గంటల పనివిధానాన్ని అమలు చేస్తున్నదని విమర్శిం చారు. కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కు లేకుండా లేబర్‌ కోడ్‌లను తెస్తున్నదని అన్నారు. పెట్టుబడిదారులు దోపిడీ చేసేందుకు అనుకూలంగా చట్టాలను మారుస్తున్నదని విమర్శించారు. రైతాంగం కనీస మద్దతు ధర కోసం ఉద్యమిస్తే భూమి నుంచి వారిని దూరం చేసి కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తున్నదని చెప్పారు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక లక్షకుపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల ఉపాధి హామీ పనికి రూ.2.50 లక్షల కోట్లు కావాలని అడిగితే రూ.86 వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేంద్రం కేటాయించిందని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడు తున్నదని విమర్శించారు. ఒక శాతం సంపన్నుల వద్ద 40 శాతం సంపద పోగయ్యిందన్నారు. 50 శాతం ప్రజల వద్ద మూడు శాతం సంపద ఉందని వివరించారు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుదోగ్య సమస్య తీవ్రమవుతున్నదని చెప్పారు. ధరలు పెరుగుతున్నాయని వివరించారు. రేషన్‌ కార్డు మీద 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కానీ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పేద లకు నిలువనీడ లేదని చెప్పారు. గుడిసెలు వేసుకుంటా మంటే తొలగిస్తున్నారని అన్నారు. ఇంటి స్థలాలను కేటాయించి ఇండ్లను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. విద్యావైద్యం వ్యాపారంగా మారాయని విమర్శించారు. ప్రభుత్వరంగంలోనే అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్‌ చేశారు. సామాజిక అస మానతలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముం దన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సోషలిస్టు వ్యవస్థకు అనుకూలంగా పోరాటాలు చేయాలనీ, అదే నిజమైన ప్రత్యామ్నాయమని అన్నారు. సోషలిస్టు వ్యవస్థ కోసం శ్రామికులంతా ఐక్యంగా పోరాడాలన్నారు. ఈనెల 20న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ప్రకటించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామా లు, బస్తీల్లో సమ్మెకు మద్దతుగా కార్యక్రమాలను చేపడతా మని అన్నారు. ఈనెల ఎనిమిదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తం గా సభలు, సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో శ్రామికవర్గ పోరా టాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను, వనరులను కార్పొ రేట్లకు కట్టబెట్టేందుకే ఆపరేషన్‌ కగార్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు. మావోయి స్టులతో శాంతి చర్చలను జరపాలనీ, ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం అవినీతికి సంబం ధించి ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వివరాలను అఖిలపక్షం ముం దుంచాలని ప్రభుత్వానికి సూచించారు. ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు తీసుకుంటున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్ది అంటున్నారనీ, ఆచరణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇతర పథకాలేవీ సంపూర్ణంగా అమలు కావడం లేదని అన్నారు. మిగతా గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
కార్మికుల హక్కులపై బీజేపీ దాడి : అరుణజ్యోతి
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం దాడి చేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ జ్యోతి విమర్శించారు. హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్య మించాలని ఆమె పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు టి సాగర్‌, బండారు రవికుమార్‌, సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, బి చంద్రా రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి ఆశయ్య, ఆర్‌ వెంకట్రా ములు, జె బాబురావు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img