Monday, November 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికే ప్రజావాణి: తహశీల్దార్

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికే ప్రజావాణి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం 
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నామని జన్నారం ఎంఆర్ఓ రాజ మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో  ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. స్థానికంగా పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరించి, సాధ్యం కాని వాటిని కలెక్టరేట్కు పంపిస్తామని తెలిపారు. ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -