- Advertisement -
- రాఘవపట్నం సర్పంచ్ కోరం రామ్మోహన్
నవతెలంగాణ-గోవిందరావుపేట: ఫ్రెండ్లీ పోలీస్‌తో ప్రజా సంబంధాలు పురోగతి సాధించాలని రాఘవపట్నం నూతన సర్పంచ్ కోరం రామ్మోహన్ అన్నారు. సోమవారం పసర పోలీస్ స్టేషన్‌లో నూతనంగా విధుల్లో చేరిన ఎస్ఐ తాజుద్దీన్‌ను సర్పంచి రామ్మోహన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ఎస్ఐ తాజుద్దీన్ మండల ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి, పదోన్నతి పొందాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ ర్యక్రమంలో ఉప సర్పంచ్ గుంటా సుదీర్,నరసింహ,జాకీర్,షరీఫ్,కమలాకర్,మొగిలి,రంగారావు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



