జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ -భువనగిరి కలెక్టరేట్ :ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 45 అర్జీలను, జిల్లా కలెక్టర్,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి,స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. స్టేట్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవిన్యూ శాఖ 30,జిల్లా పంచాయతీ 4, జిల్లా గ్రామీణ అభివృద్ధి 2, సంక్షేమ శాఖ , ఎస్సీ కార్పొరేషన్, వైద్య, మున్సిపాలిటీ, రోడ్లు& భవనాలు మత్య, గ్రౌండ్ వాటర్, మైనింగ్, వ్యవసాయ, శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,హౌసింగ్ పి.డి విజయసింగ్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.