- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పంజాబ్ రవాణాశాఖ మంత్రి భుల్లార్ తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా గోదాముల టెండరును తన తండ్రికి కేటాయించాలని మంత్రి ఒత్తిడి తెచ్చినా, గగన్‌దీప్ సింగ్ రూ.10 లక్షల ముడుపులు తీసుకుని మరొకరికి కేటాయించారని ఆరోపణలున్నాయి. ఈ నెల 13న గగన్‌దీప్ సింగ్‌ను ఇంటికి పిలిపించి మంత్రి దాడి చేశారని సమాచారం. ‘మంత్రి భుల్లార్ నన్ను వేధిస్తున్నారు. నేను ఇప్పుడు బతకలేను. విషపూరిత పదార్థం తాగాను’ అని గగన్‌దీప్ సింగ్ తన మిత్రుడికి చెప్పిన వీడియో బయటకొచ్చింది.
- Advertisement -



