నవతెలంగాణ – సదాశివ నగర్
మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సదాశివ నగర్ తహసిల్దార్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్నను తీసుకురావాలని సూచించారు. క్వింటాలుకు రూ.2400 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కమలాకర్ రావు, మాజీ వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్ రెడ్డి ,డైరెక్టర్లు సామల గంగవ్వ గాదారి బాల్రెడ్డి ,బాబయ్య గాదారి నర్సారెడ్డి మార వెంకట్రెడ్డి మధుసూదన్ రె,డ్డి ,బాదావత్ నారాయణ ,ఒంటరి చిన్న రాజిరెడ్డి, అనసూయ సీఈవో విగ్నేష్ గౌడ్ రైతులు సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియం చేసుకోవాలి: తహసిల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES