Tuesday, July 1, 2025
E-PAPER
HomeNewsపూరి నయా సినిమా షురూ

పూరి నయా సినిమా షురూ

- Advertisement -

విజయ్‌ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందనున్న పాన్‌-ఇండియా సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ వెంచర్‌ని పూరి జగన్నాథ్‌ పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌లో చార్మీ కౌర్‌ సమర్పకురాలిగా, జేబీ మోషన్‌ పిక్చర్స్‌ జేబీ నారాయణ్‌ రావు కొండ్రోల్లా కలిసి నిర్మిస్తున్నారు. జేజీ మోషన్‌ పిక్చర్స్‌తో కొలాబరేషన్‌ కావడంతో ఈ సినిమా గ్రాండియర్‌ని మరింతగా పెరిగింది. దర్శకుడు పూరి జగన్నాథ్‌ సినిమాకి సంబంధించిన అన్నీ విషయాల్లో చాలా కేర్‌ తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్‌ని రాశారు. అలాగే కథకి సరిపోయే నటీనటులను ఎంపిక చేశారు. పూరి తన సినిమాల్లో హీరోల్ని ఏవిధంగా ప్రజెంట్‌ చేస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలోనూ తన దైన మార్క్‌తో హీరో విజరు సేతుపతి పాత్రను డిజైన్‌ చేశారు. ఈ పాత్ర ప్రేక్షకుల్ని కచ్చితంగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది.ఈ చిత్రంలో టబు, విజరు కుమార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈనెల మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఈ పాన్‌-ఇండియా ఎంటర్‌టైనర్‌ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఐదు భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఏర్పడిన అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌, నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, జెబి నారాయణరావు కొండ్రోల్లా, ప్రజెంట్స్‌: చార్మీ కౌర్‌, సిఈవో: విషు రెడ్డి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -