Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంకిమ్ జాంగ్ ఉన్‌కు థ్యాంక్స్ చెప్పిన పుతిన్..

కిమ్ జాంగ్ ఉన్‌కు థ్యాంక్స్ చెప్పిన పుతిన్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌.. ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న యుద్ధంలో త‌మ‌కు స‌హ‌క‌రించినందుకు కిమ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ర‌ష్యాలోని కుర్స్ ప్రాంతంలో పోరాడిన ఉత్త‌ర కొరియా ప్ర‌త్యేక ద‌ళాల‌ను పుతిన్ గుర్తు చేశారు. ప్ర‌స్తుతం చైనా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న పుతిన్‌, కిమ్ ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. మీ సైనికులు చాలా ధైర్యంగా, హీరోల్లా పోరాడార‌ని పుతిన్ పొగిడారు. కిమ్‌తో జ‌రిగిన చ‌ర్చ‌లో ఈ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఉత్త‌ర కొరియా ద‌ళాలు చేసిన త్యాగాల‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని పుతిన్ అన్నారు.నార్త్ కొరియా ప్ర‌జ‌ల‌కు త‌మ గ్రీటింగ్స్ చెప్పాల‌ని కిమ్‌ను పుతిన్ కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad