Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుదేశ ప్రగతిని పరుగులు పెట్టించిన పీవీ

దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన పీవీ

- Advertisement -

– మాజీ ప్రధానిని స్మరించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, రచయిత, ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారతరత్న పి.వి. నరసింహారావు జయంతి సంద ర్భంగా ఆయనను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి స్మరించుకున్నారు. ప్రధానిగా విప్లవాత్మక సంస్క రణలు తీసుకువచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం లోనూ, అన్ని రంగాల్లో ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత పి.వి.నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి కొనియాడారు. పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయని అన్నారు. విద్యా వ్యవస్థలో వినూత్న విధానాలు ప్రవేశ పెట్టారనీ, నవోదయ విద్యాలయాలు పీవీ హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సర్వేల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నెలకొల్పి గురుకుల విద్యకు తొలి అడుగులు వేశారని తెలిపారు. పీవీ స్పూర్తితోనే రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్టు సీఎం తెలియజేశారు. రాష్ట్రంలో గురు కుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు, ప్రతి నియోజక వర్గంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం సంకల్పించిందని గుర్తుచేశారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad