Wednesday, January 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యమైన విద్యను అందించాలి 

నాణ్యమైన విద్యను అందించాలి 

- Advertisement -

గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు తారా సింగ్  
నవతెలంగాణ-మిడ్జిల్ : ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఉపాధ్యాయులు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన విద్యను అందించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు తారా సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మండల విద్యాధికారి సరస్వతి, గిరిజన ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు కృష్ణా నాయక్, కార్యదర్శి , కోట్య నాయక్  తో కలిసి  గిరిజన ఉపాధ్యాయ సంఘం  2026 డైరీ,  క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన తండాలో మూతబడిన పాఠాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాలకు దూరంగా ఉంటున్న తండాలలో గిరిజన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారని ప్రభుత్వమే రవాణా  సౌకర్యం కల్పించాలని కోరారు. పాఠశాలలో ఉన్న సమస్యలు  ప్రభుత్వ పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆర్ నర్సింలు, వెంకటయ్య, తారా సింగ్, శంకర్ నాయక్, విజయ్ భాస్కర్, రమేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -