నవతెలంగాణ-హైదరాబాద్: గూఢచర్యం కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తు అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో సంబంధాలు, అంతర్జాతీయ పర్యటనలు, సమాచార బదిలీ గురించి ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో లోతుగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. జ్యోతి పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్ పర్యటనలపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సవాన్ వెల్లడించారు. అంతేకాదు పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు ఆమె సంబంధాలను ఏర్పరచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీలో పాక్ రాయబారి డానిష్‌తో సంబంధాలపై ఆమె బుకాయించినట్లు తెలిసింది. సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా ను అధికారులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
జ్యోతి మల్హోత్రాపై ప్రశ్నల వర్షం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES