నవతెలంగాణ-మద్నూర్: రాచూరు గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో పూర్తిగా మద్యం అమ్మకాలు నిషేధిస్తూ తీర్మానం చేసినట్టు సర్పంచ్ లోకండే ఆకాష్, ఉపసర్పంచ్ మారుతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు పటేల్ ఆధ్వర్యంలో గ్రామసభ వేదిక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. నిబంధనలును ఉల్లంఘిస్తే 50 వేల రూపాయలు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. సదురు తీర్మానం కాపినీ మంగళవారం ఎక్సైజ్ సీఐకి అందజేసినట్లు చెప్పారు. గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్సై గ్రామాన్ని సందర్శిస్తానని తెలిపినట్లు సర్పంచ్ తెలియజేశారు. ఊరు బాగు కోసం అందురూ కలిసి మంచి నిర్ణయం తీసుకున్నారని, మండలంలో రాచూరు గ్రామం ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
మద్యం అమ్మకానికి నిషేధిస్తూ రాచూర్ గ్రామస్తుల తీర్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



