- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ఉ.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కీలక నేతలు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.
- Advertisement -