నవతెలంగాణ-హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి జాదవ్ సాయి తేజను సీనియర్లు బలవంతంగా మద్యం తాగించడంతోపాటు బార్ కి తీసుకెళ్లి సీనియర్లు ఫుల్ గా తాగారు. అనంతరం 10 వేల రూపాయల బిల్లు కట్టాలని జాదవ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక నారపల్లిలోని మధు బాయ్స్ హాస్టల్ లో తన రూమ్ లో సాయి తేజ ఉరేసుకున్నాడు. హాస్టర్ నిర్వహకులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్లు ర్యాగింగ్ చేయడం వల్లే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ల ర్యాగింగ్..ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES