Sunday, November 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాచుపల్లి JNTU ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

నాచుపల్లి JNTU ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల జిల్లా నాచుపల్లి JNTU ఇంజినీరింగ్ కళాశాలో ర్యాగింగ్ కలకలం రేపింది. “ఇంట్రాక్షన్” పేరుతో రెండో సంవత్సరం విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మానసికంగా వేధించినట్లు సమాచారం. అవమానకరమైన ప్రశ్నలు అడగడం, గట్టిగా అరిచి భయపెట్టడంతో కొందరు జూనియర్లు తరగతులకు రాలేకపోయారు. ఘటనపై కళాశాల అధికారులు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -