నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు ప్రసంగించారు. కేంద్రంపై తీవ్ర విమర్శలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్‌ను ప్రభుత్వం నిర్వహించిన తీరుపై పదునైన ప్రశ్నలను సంధించారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని సవాల్ విసిరారు. “డోనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపానని 29 సార్లు చెప్పారు. ఇది నిజం కాకపోతే.. ప్రధాని ట్రంప్ వ్యాఖ్యలను తిరస్కరించాలి. ఇందిరా గాంధీకి ఉన్న 50 శాతం ధైర్యంలో సగం అయినా మీకు ఉంటే.. సభలో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వండి.” అని రాహుల్ గాంధీ అన్నారు.
పీఎం మోడీకి రాహుల్ సవాల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES