నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అధికారాలను కేంద్రీకృతం చేయాలని చూస్తున్నాయని, కానీ అధికారాల వికేంద్రీకరణ కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం కేరళలోని కొట్టాయం ఆ పార్టీ సమావేశాలల్లో భాగంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యయుత భారత్ ప్రభుత్వంలో సామాన్య ప్రజల వాయిస్‌ను వాళ్లు(బీజేపీ, RSS) వినాలని కోరకోవడంలేదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థులపై ప్రశంసలు కురిపించారు. పార్టీ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులను అభినందించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీశ్రేణులు ఇదే ఉత్సాహన్ని చూపాలని, ఈ సారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై రాహుల్ గాంధీ ఫైర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



