న్యూఢిల్లీ : దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాల దిద్దుబాటును బడ్జెట్ విస్మరించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం విమర్శించారు. ”యువత ఉద్యోగాలు కోల్పోవడం, తయారీ రంగం పడిపోవడం, పెట్టుబడిదారులు మూలధనాన్ని వెనక్కితీసుకోవడం , కుటుంబ పొదుపులు పడిపోవడం, రైతులు ఇబ్బందులు, ప్రపంచదేశాల నుండి పొంచి వున్న షాక్‌లు.. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. దేశ వాస్తవ సంక్షోభాలను దిద్బుబాటును బడ్జెట్ విస్మరించింది” అని రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
విధాన దృక్పథం లోపించిన బడ్జెట్ : ఖర్గే
మోడీ ప్రభుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విధాన దృక్పథం లోపించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. భారతదేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ,సామాజిక మరియు రాజకీయ సవాళ్లకు ఈ బడ్జెట్ పరిష్కారం చూపలేదని అన్నారు. పలు సమస్యలకు బడ్జెట్ పరిష్కారం చూపకపోగా, వైఫల్యాలను కప్పిపుచ్చే నినాదాలను కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వంలో ఆలోచనలు అయిపోయాయని అన్నారు. మిషన్ మోడ్ ప్రస్తుతం చాలెంజ్ రూట్‌గా మారిందని, రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్ రీఫార్మ్ జంక్షన్‌లో ఆగుతుందని, నికర ఫలితం విధాన దృక్పథం లేని బడ్జెట్, రాజకీయ సంకల్పం కూడా లేదు అని అన్నారు. రైతులు అర్థవంతమైన సంక్షేమ మద్దతు, ఆదాయ భద్రతా ప్రణాళిక కోసం ఎదురుచూస్తున్నారని ఖర్గే అన్నారు. బ్రిటీష్ పాలనలో కన్నా అసమానతలు పెరిగాయని, బడ్జెట్‌లో వాటి గురించి ప్రస్తావించలేదని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఇడబ్ల్యుఎస్ మరియు మైనారిటీ వర్గాలకు ఎటువంటి మద్దతు అందించలేదని మండిపడ్డారు. ఆర్థిక కమిషన్ సిఫారసులను మరింత అధ్యయనం చేయాల్సి వుందని, తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ఉపశమనం కల్పించలేదని అన్నారు.
కేంద్ర బడ్జెట్ పై స్పందించిన రాహుల్ గాంధీ, ఖర్గే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



