నవతెలంగాణ-హైదరాబాద్:
నవతెలంగాణ-హైదరాబాద్: పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నావీ ఆఫీసర్ లెప్ట్‌నెంటల్ వినయ్ నర్వాల్ కుటుంబసభ్యులను పతిపక్షనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. హర్యానాలోని కర్నాల్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను కలిశారు. హరియాణాకు చెందిన వినయ్- హిమాన్షి వివాహం ఏప్రిల్ 16న జరిగింది. 19న విందు నిర్వహించారు. అనంతరం భార్యను తీసుకొని జమ్మూకశ్మీర్‌కు హనీమూన్‌కు వెళ్లారు. ఉగ్రదాడితో ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. బుల్లెట్ల గాయాలకు తన కండ్ల ముందే ఆమె భర్త వినయ్ నర్వాల్ చనిపోయాడు. ఈ విషాద సంఘటన యావత్తు దేశాన్ని దుఃఖ సద్రంలో ముంచింది. అంత్యక్రియల సమయంలో భర్తకు సెల్యూట్ చేస్తూ ఆమె రోదించిన తీరు ప్రతిఒక్కరిని బాధించింది.
వినయ్ నర్వాల్ ఇంటికి చేరుకున్న రాహుల్ గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES