- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్నూలులోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు దుర్ఘటనలో మృతి చెందినవారికి కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
- Advertisement -



