నవతెలంగాణ-హైదరాబాద్: భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై చర్యలను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు గురువారం పొడిగించింది. డిసెంబర్ 4 వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో విచారణను వాయిదా వేసింది. వాయిదా కోరుతూ వచ్చిన లేఖను పరిశీలించినట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌ను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. 2022 డిసెంబర్‌లో భారత్ జోడోయాత్రలో చైనాతో ఘర్షణల సమయంలో రాహుల్‌గాంధీ ఆర్మీపై అవమానకరవ్యాఖ్యలు చేశారంటూ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ ఫిర్యాదు చేశారు.
Rahul Gandhi : మధ్యంతర ఉతర్వులను పొడిగించిన సుప్రీంకోర్టు
- Advertisement -
- Advertisement -



