నవతెలంగాణ-హైదరాబాద్: రేపు ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఆ రాష్ట్రంలోని పూంచ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల కురిసిస భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో పలు ఇండ్లు కూలిపోవడంతో పాటు వరద నీరుకు కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. అదేవిధంగా బలమైనా ఈదురు గాలులకు స్కూల్స్, పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్ కారణంగా పాక్ జరిపిన కాల్పుల్లో కూడా ఆయా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దీంతో స్థానిక బాధితులను ఆయన పరామర్శించనున్నారని కాంగ్రెష్ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏప్రీల్ 22న జరిగిన పహల్గాం దాడి బాధితులను కూడా రాహుల్ గాంధీ శ్రీనగర్ వెళ్లి పరామర్శించారు. తాజాగా మరోసారి వరదబాధితులను కలువనున్నారు.
రేపు జమ్మూ వెళ్లనున్న రాహుల్‌గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES