నవతెలంగాణ-హైదరాబాద్: హర్యానా కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాన్ కుమార్ ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చండీగఢ్‌లోని పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరేళ్ల నుంచి పురన్‌పై వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. డ్రామాలు ఆపి పూరన్ అంత్యక్రియలు నిర్వహించాలంటూ బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో ప్రపంచానికి తెలియాలని రాహుల్ అన్నారు. ఈ నెల 7న పూరన్‌కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా, ఉన్నతాధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమంటూ ఎనిమిది పేజీల సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు.
పూరన్ కుమార్ కుటుంబసభ్యులకు రాహుల్ గాంధీ పరామర్శ
- Advertisement -
- Advertisement -