నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి మోడీ రేపు మిజోరాంతో పాటు మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఈక్రమంలో పీఎం పర్యటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలస్యమైనా ప్రధాని మోడీ మణిపూర్ పర్యటనను స్వాగతిస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు. చాలా నెలల తర్వాత ప్రధాని ఆ రాష్ట్రానికి వెళ్తుతున్నారని, ఇప్పటికైనా అక్కడి పరిస్థితులు చక్కదిద్దాలని సూచించారు. ఇవాళ రాహుల్ గాంధీ గుజరాత్‌లోని జునాగడ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. మణిపూర్ లో అనేక సమస్యలు తిష్టవేశాయని, ఎట్టకేలకు ప్రధాని అక్కడకు వెళ్తుతున్నారని, అందుకు సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ప్రస్తుతం ఓట్ చోరీ అని గుర్తు చేశారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు చోరీ అయ్యాయని, ఆ రాష్ట్రాల్లో మరోసారి రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ మణిపూర్ పర్యటనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES