Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌కి రాహుల్‌గాంధీ లేఖ

రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌కి రాహుల్‌గాంధీ లేఖ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దిబ్రూఘర్‌ నుండి న్యూఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను రాయ్‌బరేలి జంక్షన్‌లో ఆపాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కోరారు. ఈ అంశంపై రాహుల్‌గాంధీ రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌కి లేఖ రాసినట్లు ఆయన సన్నిహితుడు, అమేథీ ఎంపి కిషోరి లాల్‌ శర్మ శుక్రవారం ధృవీకరించారు. 20503/20504 మరియు 20505/20506 నెంబర్లు గల రైళ్లు రారుబరేలి జంక్షన్‌లో ఆగేలా ఏర్పాటు చేయాలనే ప్రజల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రారుబరేలి మీదుగా వెళుతుందని, కానీ జంక్షన్‌లో ఆగడం లేదని అన్నారు. తమ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా రారుబరేలీ స్టేషన్‌లో ఆగాలని తన నియోజకవర్గం ప్రజలు చాలా కాలంగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ డిమాండ్‌ చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, ఆమోదించడం ద్వారా తన నియోజకవర్గ ప్రజల ప్రయాణం సులభతరం అవుతుందని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad