Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంపూరీ జగన్నాథ ర‌థ‌యాత్ర తొక్కిస‌లాట‌పై రాహుల్ గాంధీ స్పంద‌న‌

పూరీ జగన్నాథ ర‌థ‌యాత్ర తొక్కిస‌లాట‌పై రాహుల్ గాంధీ స్పంద‌న‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఒడిశాలోని పూరీ జగన్నాథ ర‌థ‌యాత్ర‌లో చోటుచేసుకున్న‌ తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. “పూరీలో రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. సహాయ చర్యలను వేగవంతం చేయాలని, ఈ విషయంలో సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించాలని కాంగ్రెస్ కార్యకర్తల‌కు పిలుపునిచ్చారు. ఈ విషాదం ఒక తీవ్రమైన హెచ్చరిక – ఇంత పెద్ద కార్యక్రమాలకు, భద్రతా ఏర్పాట్లు, జనసమూహ నిర్వహణ సన్నాహాలను తీవ్రంగా పరిగణించి పూర్తిగా సమీక్షించాలి. ప్రజల ప్రాణాలను రక్షించడం చాలా ముఖ్యమైనది , ఈ బాధ్యతలో ఎటువంటి లోపాలు ఆమోదయోగ్యం కాదు.” అని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం కాగా.. ఆదివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. 60 మంది వరకు భక్తులకు గాయాలు అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -