Friday, February 27, 2026
E-PAPER
Homeజాతీయంపీఎంపై రాహుల్ గాంధీ సెటైర్లు

పీఎంపై రాహుల్ గాంధీ సెటైర్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రాష్ట్రప‌తి ధ‌న్యావాద తీర్మానంపై ప్ర‌ధాని మోడీ రాజ్య‌స‌భ‌లో మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పీఎంపై ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. మోడీ ఏది సరైనదని అనుకుంటే అది చేశార‌ని(Do whatever you think is right), ఆదే విష‌యం మాజీ ఆర్మీ చీప్ జ‌న‌ర‌ల్ చెప్పార‌ని చుర‌కలంటించారు. ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులోని మకర్ ద్వార్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు, “జో ఉచిత్ సంఝో వహీ కరో” నినాదాలు చేస్తూ.. “ట్రాప్ డీల్” అని రాసి ఉన్న ప్లకార్డులను ప్ర‌ద‌ర్శించారు.

అయితే అంతక‌ముందు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ వాణిజ్య ఒప్పందంపై చర్చ జరగాలని లోక్‌సభలో ప్రతిపక్షసభ్యులు పట్టుబట్టారు. సభ ప్రారంభం కాగానే ప్లకార్డులు చేతబట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లారు. సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రారంభమైన కొద్ది నిమిషాలకే స్పీకర్‌ ఓంబిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈరోజు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ జరిగే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -