- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టనున్న “ఓటర్ అధికార్ యాత్ర” బిహార్‌లోని ససారాం నుంచి నేడు (ఆదివారం) ప్రారంభం కానుంది. 16 రోజులపాటు 25 జిల్లాల్లో 1300 కి.మీ. పర్యటించనున్నారు. ఈనెల 20, 25, 31వ తేదీల్లో మినహా సెప్టెంబర్ 1 వరకు యాత్ర జరుగుతుంది. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలతో ప్రజల మధ్యకు రాహుల్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో “ఓటర్ అధికార్ యాత్ర” ముగియనుంది.
- Advertisement -