Thursday, November 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఘ‌నంగా రాహుల్ సిప్లిగంజ్ వివాహం

ఘ‌నంగా రాహుల్ సిప్లిగంజ్ వివాహం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకుని కొత్త జీవితం లోకి అడుగుపెట్టారు. తాజాగా జరిగిన వివాహ వేడుక కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొనేలా అత్యంత వైభవంగా నిర్వహించినట్లు సమాచారం. రాహుల్–హరిణ్య వివాహ ఫోటోలు వీరిద్దరూ అధికారికంగా షేర్ చేయకపోయినా, సోషల్ మీడియాలో దర్శనమైన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారి ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.

రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్‌లో సింగర్‌గా భారీ విజయాలు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఆయన క్రేజ్, ప్రతిభ స్థాయి ప్రపంచానికి చాటి చెప్పింది. హరిణ్య రాజకీయ కుటుంబానికి చెందిన యువతి. గత రెండు నెలల క్రితం ఈ జంట ఘనంగా నిశ్చితార్థం జరుపుకుని తమ ప్రేమను అధికారికం ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -