నవతెలంగాణ-హైదారాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీహార్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ పేరుతో సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ రాష్ట్ర ఓటర్ జాబితాను ఈసీ విడుదల చేసింది. ఈ ముసాయిదా లోపభూయిష్టం ఉందని, సరైన పత్రాలు లేకుండా పలువురు పేర్లు జత చేశారని, అదే విధంగా తప్పుడు పత్రాల చిరునామాలతో ఓటర్ జాబితాలో కొందరి పేర్లు నమోదు చేశారని, మరోవైపు మొత్తం 65 లక్షల ఓట్లను ఈసీ తొలగించిందని ప్రతిపక్షనేత రాహుల్ వివరించిన విషయం తెలిసిందే. బీహార్‌లో ఓట్ల సర్వే పేరుతో ఎన్నికల సంఘం బాగోతాన్ని వెలుగులోకి తేవడానికి ప్రతిపక్షనేత తన పోరాటాని ఉధృతం చేశారు. తాజాగా బీహార్ ఓట్ల చోరీ ఉదంతంపై మరో కొత్త వీడియో విడుదల చేశారు.
‘లాపాటా లేడీస్’ మూవీలోని ఓ వీడియోను ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. ఈ వీడియోలో పోలీస్ స్టేషన్‌కి ఓ వ్యక్తి వచ్చి.. దొంగతనం జరిగింది ఫిర్యాదు తీసుకోండి అని అడుగుతాడు. దొంగతనం ఏం జరిగింది.. మోటార్ సైకిల్, సైకిల్ ఏ వస్తువు దొంగతనం జరిగింది అని పోలీసులు ఆ వ్యక్తినిని అడగ్గా.. ఓటు దొంగతనం జరిగింది అని వ్యక్తి అంటాడు. ఓటా? అని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు? ఓటుకీ చోరీ.. అధికారికీ చోరీ హై అని వీడియో ముగుస్తుంది. అయితే ఓటు చోరీ అయితే.. ప్రజలు ప్రశ్నిస్తారు అన్న విధంగా.. ఈ వీడియోకు జతగా ‘రహస్యంగా.. దొంగచాటుగా అనేది ఇప్పుడు లేదు. ప్రజలు మేల్కొన్నారు’ అని రాహుల్ క్యాప్ష్‌న్ రాశారు.