- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి,మాదాపూర్‌లోని పలు పబ్‌లలో ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని ఎస్‌ఎల్‌ఎస్ టెర్మినల్ మాల్‌లో ఉన్న క్లబ్ రౌగ్ పబ్, ఫ్రాట్ హౌస్ పబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు గుర్తించారు. క్లబ్ రఫ్ పబ్‌లో తనిఖీలో భాగంగా పలువురికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. దీంతో నలుగురు యువకులు గంజాయి తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. వారిలో డీజే ప్లేయర్ శివ కూడా ఉన్నారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదుచేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gachibowli
- Advertisement -