Friday, February 13, 2026
E-PAPER
Homeకరీంనగర్రాయికల్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ విజయవంతం

రాయికల్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ విజయవంతం

- Advertisement -

-రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు పూర్తి
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో శాంతియుతంగా పూర్తైంది. నిర్ణీత మార్గదర్శకాలకు అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ నిర్వహించారు. ప్రత్యేక అధికారి,జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారులు ప్రతి టేబుల్ వద్ద లెక్కింపు విధానాన్ని సమీక్షించారు. తహసిల్దార్ నాగర్జున, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, ఎంపీడీవో బింగి చిరంజీవి మరియు ఇతర అధికారుల సమన్వయంతో ప్రక్రియ పారదర్శకంగా సాగింది.

ప్రతి వార్డు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించే ముందు రిటర్నింగ్ అధికారులు ధృవీకరణ చేసి అనంతరం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కౌంటింగ్ పూర్తి కావడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో సహకరించిన సిబ్బంది,రాజకీయ పార్టీ ప్రతినిధులకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -