No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంటికెట్ రిజర్వేషన్‌పై రైల్వే బోర్డు కీలక నిర్ణయం

టికెట్ రిజర్వేషన్‌పై రైల్వే బోర్డు కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే, టికెట్ రిజర్వేషన్ విధానంలో కీలక మార్పులు తీసుకొస్తోంది. రైలు బయలుదేరే సమయానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్టులను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ప్రస్తుతం, రైలు బయలుదేరే 4 గంటల ముందు చార్టు తయారవుతోంది. అలా కాకుండా 8 గంటల ముందే చార్ట్ తయారవ్వడం వల్ల ప్రయాణికులకు ఎక్కువ మేలు జరుగుతుదాని రైల్వే బోర్డు చెప్పింది. ఈ ప్రతిపాదన జులై 1 నుంచి దశలవారీగా దేశమంతా అమల్లోకి వస్తుంది.

చాలా మంది ట్రైన్ టికెట్ బుక్ అవుతుంది అనుకొని.. ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కి బయలుదేరుతున్నారు. తీరా వారు జర్నీలో ఉన్నప్పుడు.. చార్ట్ రెడీ అవుతోంది. అందులో చూస్తే, టికెట్ రాలేదని తెలిస్తే, వారు ఇబ్బంది పడుతున్నారు. వేరే రైలు బుక్ చేసుకుందామంటే.. అప్పటికప్పుడు కుదరట్లేదు. పోనీ బస్సులో వెళ్దామంటే.. బస్టాండ్ దగ్గర్లో ఉండట్లేదు. ఇలా జర్నీలో రకరకాల సమస్యలు ఎదురై.. బాగా ఆలస్యమవుతోంది. అదే 8 గంటల ముందే చార్ట్ రెడీ అయితే.. టికెట్ రాలేదని తెలిస్తే, ఆల్టర్నేట్ మార్గాలను ప్రయాణికులు ఎంచుకోగలరు.ఈ కొత్త నిర్ణయంతో ప్రయాణికుల్లో టికెట్ కన్ఫర్మేషన్‌కు సంబంధించిన టెన్షన్ ముందే తొలగనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad