Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో

రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో

- Advertisement -

స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తే అడ్డుకుంటాం :
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల చక్రపాణి హెచ్చరిక
నవతెలంగాణ-కాజీపేట

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ కోసం అనేక ఏండ్లు పోరాడి సాధించుకున్నామని, అందులో ఈ ప్రాంత యువకులకే ఉద్యోగాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల చక్రపాణి అన్నారు. ఉద్యోగాల కల్పనను ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్‌ ఎదుట మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్‌ 1 నుంచి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ మరమ్మతు పనులను ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, దానిని వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అనేక సంవత్సరాలుగా చేసిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలని, లేనియెడల సీఐటీయూ ఇతర సంఘాలను కలుపుకొని పెద్దఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి కారు ఉపేందర్‌, నాయకులు జంపాల రమేష్‌, ఏ.జాన్‌, రాజు, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -