Friday, April 10, 2026
E-PAPER
Homeఖమ్మంవర్షపాత కొలమానుల తనిఖీ

వర్షపాత కొలమానుల తనిఖీ

- Advertisement -

– ఖచ్చితమైన నమోదు చేయాలని అధికారుల ఆదేశం
నవతెలంగాణ – అశ్వారావుపేట 

తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వర్షపాత కొలమానులును గణాంక శాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గణాంకాల అధికారి ఉదయ్ కుమార్, తహశీల్దార్ దాసరి కిశోర్ పాల్గొన్నారు.

వర్షపాత కొల మానిని లో అంతర్గత పరికరాలను, నమోదవుతున్న నీటి మోతాదును పరిశీలించిన అధికారులు, నమోదు లు సక్రమంగా నిర్వహిస్తున్నారా అనే అంశంపై దృష్టి సారించారు. కొలమానం పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా అనే విషయాన్ని కూడా వారు సమీక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ నెల నుండి వచ్చే ఏడాది మే వరకు వర్షపాతం నమోదు కాలంగా పరిగణిస్తారని తెలిపారు. ఆ కాలంలో నమోదయ్యే వర్షపు గణాంకాలు వ్యవసాయం, నీటి నిర్వహణ, ప్రభుత్వ ప్రణాళికలకు కీలకమని పేర్కొన్నారు.

అలాగే, ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో వర్షపాత కొలమానుల వార్షిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ తనిఖీల ద్వారా గణాంకాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించి, భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు సరైన ఆధారాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.

సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి, వర్షపాతం నమోదులను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా నమోదు చేయాలని అధికారులు సూచించారు. వారి వెంట ఏఎస్ఓ దుర్గా రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -