Saturday, September 13, 2025
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్‌లో వర్షాలు.. ఐదుగురు మృతి

జార్ఖండ్‌లో వర్షాలు.. ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జార్ఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. ఒకరు గల్లంతయ్యారు. పలువురు గాయపడ్డారని శనివారం అధికారులు తెలిపారు. సెరైకెల్లా ఖర్సవాన్‌ జిల్లాలో వర్షానికి ఇల్లు కూలి ఓ మహిళ, ఆమె కుమారుడు మృతి చెందారు. రాజ్‌నగర్‌ బ్లాక్‌లోని దండు గ్రామంలో జరిగిన మరో సంఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.కాగా, మరో సంఘటనలో ఇల్లు కూలి మహిళ, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడడంతో.. వారిని జంషెడ్‌పూర్‌లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే సంతోష్‌ లాహోర్‌ కుచ్చా ఇల్లు కూలిపోవడంతో మరో ఎనిమిది మంది గాయపడ్డారు అని పోలీసులు మీడియాకు వెల్లడించారు.ఖరస్వాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కోల్‌ షిమ్లాలో ఇల్లు కూలి ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారంనాడు ఛత్రా జిల్లాలో ఉప్పొంగుతున్న నదిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన కట్ఘరా గ్రామంలో జరిగింది. ఈ సంఘటనలో భర్త మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్య గల్లంతయింది. గిధౌర్‌ బిడివో (బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌) రాహుల్‌ దేవ్‌ మీడియాకు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -