– బెంగళూర్, కోల్‌కత మ్యాచ్ రద్దు
బెంగళూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రీ స్టార్ట్‌కు వరుణుడు కుండపోత వర్షంతో స్వాగతం పలికాడు. బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, కోల్‌కత నైట్‌రైడర్స్ మ్యాచ్ ఎడతెగని వర్షంతో రద్దుగా ముగిసింది. భారత్, పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతలతో ఐపీఎల్18 మే 9న వాయిదా పడగా.. శనివారం నుంచి మళ్లీ మెదలైంది. అయితే, రీ షెడ్యూల్‌లో తొలి మ్యాచ్‌కే వర్షం ఆటంకం కలిగించటంతో అభిమానులు, ఆటగాళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా.. భారీ వర్షంతో టాస్ వేయడానికి కూడా సాధ్యపడలేదు. వర్షం తగ్గే పరిస్థితులు లేకపోవటంతో రాత్రి 10.24 గంటలకు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. గ్రూప్ దశలో 12 మ్యాచుల్లో 8 విజయాలతో 17 పాయింట్లు సాధించిన బెంగళూర్ ప్లే ఆఫ్స్ బెర్త్ సొంతం చేసుకోగా.. కోల్‌కత నైట్‌రైడర్స్ 13 మ్యాచుల్లో ఐదు విజయాలతో 12 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది.
వరుణుడి జోరు
- Advertisement -
- Advertisement -